బూర్గంపహాడ్, ఆగస్టు 22 : బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని ఉప సర్పంచ్ గుండె వెంకన్న శనివారం పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అందించే ఆహారం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, రోగులకు నాణ్యతతో కూడిన వైద్యం, ఆహారం అందుతుందని అది తమ బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిమ్మల హరీష్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.