కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 22 : పేదలకు గృహ వసతి కల్పించడం ప్రజా ప్రతినిధులుగా తమ బాధ్యత అని, అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాన్ని చివరి గడప వరకు అందించే బాధ్యత తనదేనని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం పాత కొత్తగూడెం దళితవాడలో ఇండ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ కుటుంబాలకు తలదాచుకునేందుకు పక్కా గృహాలు మంజూరు చేయిస్తానని ఆనాడు హమీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నానని తెలిపారు.
ప్రతి పేద కుటుంబం తలదాచుకునే సొంత ఇల్లు పొందే వరకు కృషిని కొనసాగిస్తానని, సొంతిల్లు నిర్మించి పేదలకు సామాజిక గౌరవాన్ని, విశ్వాసాన్ని నింపే దిశగా నిరంతరం శ్రమిస్తానని ఆయన తెలిపారు. నిర్మాణాలు నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయించే బాధ్యత అధికారులదేనన్నారు. సంబంధిత బిల్లులు త్వరితగతిన జమ చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కార్పొరేషన్ కమిషనర్ సుజాత, సిపిఐ నాయకులు కంచర్ల జమలయ్య, నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు, కోడి మల్లేష్, రామారావు, గడ్డం వెంకటేశ్వర్లు, బోయిన విజయ్ కుమార్, సత్యనారాయణాచారి, భవాని, అధికారులు రవికుమార్, రామకృష్ణ పాల్గొన్నారు.
Kothagudem Urban : పేదలకు గృహ వసతి కల్పన నా బాధ్యత : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు