ఇల్లందు, మే 09 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం చంద్రుతండా గ్రామ పంచాయతీ పరిధిలో గల చంద్రుతండా, రాజుతండా, సూర్యతండా, గోపియతండాలో పలువురి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి. అధికారులు వచ్చి మీకు ఇల్లు వచ్చాయి నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకోమని పలువురికి చెప్పారు. దీంతో రాజుతండాకు చెందిన జరుపుల రమేశ్, అలాగే చంద్రుతండా, గోపితండాకు చెందిన పలువురు ఇంటి నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
అయితే తీరా ఇంటి నిర్మాణానికి ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇందిరమ్మ కమిటీ అధికారులు వచ్చి మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని, రెండో లిస్ట్‌లో ఇస్తారని తెలిపారు. దీంతో పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నవారికి మరో ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేయడాన్ని నిరసిస్తూ చంద్రుతండా పంచాయతీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అధికార పార్టీ స్థానిక నాయకులు ఇందిరమ్మ ఇంటికి డబ్బులు తీసుకుని అనర్హులకు మంజూరు చేయిస్తున్నారని, ఇందిరమ్మ కమిటీని రద్దు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Yellandu : అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన
Yellandu : అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన