కొత్తగూడెం అర్బన్, జూన్ 23 : అబద్దపు, మోసపూరిత వాగ్దానాలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం టైం పాస్ రాజకీయాలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను, 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచిన్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లోని వార్డులు మొత్తం మురికికుపంగా మారాయని, మురికి గుంటల వద్ద కనీసం బ్లీచింగ్ చల్లే నాథుడు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాకాలం సీజన్ కావడంతో ముఖ్యంగా గ్రామాల్లో దోమలు, ఈగలతో ప్రజలు విష జ్వరాల బారిన పడే ప్రమాదం ఉందని, బ్లీచింగ్ చల్లే పరిస్థితి కూడా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే గ్రామాల్లో వీధి దీపాలు వెలిగే పరిస్థితి లేదని విమర్శించారు. అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకున్న గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్లను నియమించి తక్షణమే అక్కడ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మేనేజర్‌కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు వేముల ప్రసాద్ బాబు, పల్లపు రాజు, పార్టీ సీనియర్ నాయకులు ఎండి.హుస్సేన్, రామిళ్ల మధుబాబు, ఖాజభక్ష్, మాజీద్, మునీర్, షమ్మీ, మొయినుద్దీన్, పూర్ణచందర్, అజ్మీరా విజయ్, తుంగ కనకయ్య, ఆర్ శ్రీనివాస్, శ్రీదేవి, శైలజ, కోమల, సుందర్ పాసి, ఆశ, మాధవి, స్వర్ణ, లక్ష్మి, కమల, విజయ, జి. విజయ, సుహాని, మహేశ్వరి, రమణ, శ్రావణ్, నసీమా, మహబూబ్, షేక్ బాజీ, షేక్ బిబి, సత్యవతి, షేక్ కమరన్నిస, అశోక్, సూరి, మజీద్, కాజా, నగేశ్, నాగరాజు, బాబు జానీ, షణ్ముఖ, సిద్దు, బన్ను, అమన్, రాజ మల్లయ్య పాల్గొన్నారు.