– ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్‌కు సర్పంచ్, ఉపసర్పంచ్ వినతి
బూర్గంపహాడ్, జూన్ 08 : బూర్గంపహాడ్ మండలానికి మారుమూలన ఉన్న కృష్ణసాగర్ పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, అభివృద్ధి పనులు చేపట్టి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ భూక్యా మోహనరావు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు కృష్ణసాగర్ పంచాయతీలో అభివృద్ధి పనులు మంజూరు చేయించాలని, ప్రధానంగా తాగునీరు, రహదారులు, డ్రైనేజీ తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతిలో పేర్కొన్నారు. వినతిపత్రం స్వీకరించిన కలెక్టర్ సమస్యలపై అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.