టేకులపల్లి, జనవరి 17 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ ఫిట్మెంట్ ను వెంటనే ప్రకటించాలని, గిరిజన సంక్షేమ శాఖలోని పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ హరిలాల్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల గంగారంలో జరిగిన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు సమ్మె కాలంలో ఇచ్చిన హామీ ప్రకారం సమ్మె కాలానికి జీతాన్ని చెల్లించి, వారికి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని,
గిరిజన సంక్షేమ శాఖలోని సీఆర్టీలకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు హెల్త్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని అలాగే పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు డి.జగన్, టీపీటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి పి.సమ్మయ్య, ఉపాధ్యాయులు బి.వెంకటేశ్వర్లు, బి.వాల్య నాయక్, బి.కస్నా నాయక్, మోకాల శ్రీనివాసరావు, డి.వీరన్న, ఎం.రాంబాబు, టి.రామారావు, కె.రమేశ్, బి.శ్రీవాణి, జి.బిచ్చ, బి.వీరన్న, జానయ్య పాల్గొన్నారు.