నాగర్కర్నూల్, ఫిబ్రవరి 26 : కుమ్మెర ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకున్నది. బాధితులకు న్యాయం చేయాలంటూ ఐదు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనతో వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, బహుజనులంతా ఏ కమై నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. బాధితురాలు మౌని క కులం వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. బాధితురాలు ఎస్సీ, ఎస్టీ అయితే అట్రాసిటీ కేసు నమోదు చే సేందుకు, అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తెలుసుకోవాలని ఎస్పీ రెవెన్యూ అధికారులకు సూచించిన నేపథ్యంలో మౌనిక బీసీ-ఈ (పిచ్చకుంట్ల) అని నిర్ధారించినట్టు తెలుస్తున్నది. ఆ కోణంలో విచారణ చే యాల్సి ఉండగా నాగర్కర్నూల్ అం బేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన ధ ర్నా శిబిరం నుంచి గురువారం చీకటి పడుతుండగా బాధితులను తరలించారు.
విషయం తెలుసుకున్న డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. కేసు వి చారణలో ఉండగా రెవెన్యూ, పోలీస్ అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా బాధితులను శిబిరం నుంచి తరలించడమే కాకుండా టెం ట్ను తొలగించడం ఏమిటని ప్రశ్నిస్తు న్నారు. ధర్మ సమాజ్ పార్టీ నాయకు లు రఘు, సాయి అనే వ్యక్తులు బాధితులు మౌనిక, గణేశ్ సహా కుటుంబ సభ్యులను వాహనంలో తీసుకెళ్లినట్టు డీఎస్పీ వెల్లడించారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా ఎక్కడికి తీసుకెళ్లారనేది తెలియడం లేదని, వారికి ఎలాంటి హాని జరిగినా సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లిన సాయి, రఘులే బాధ్యత వహించాల్సి ఉంటు ందని స్పష్టంచేశారు. ఇదిలావుండగా కేసు సమగ్ర విచారణ జరుగుతుండగా బాధితులను తీసుకెళ్లడం అనేది అర్థం కాని పరిస్థితి నెలకొన్నది.