ఇల్లెందు, జూలై 16 : పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ పీడీఎస్‌యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గం సీఎం రేవంత్‌రెడ్డికి పోస్ట్ కార్డుల ద్వారా అర్జీ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బుధవారం ఇల్లెందు పట్టణంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులతో కలిసి ఉత్తరాలు రాశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జె.గణేశ్ మాట్లాడుతూ.. విద్యారంగం అభివృద్ధి ప్రధాన ఎజెండాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మర్చిపోయిందన్నారు. రాష్ట్రంలో 8 వేల కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.
ప్రభుత్వం విడుదల చేయని కారణంగా డిగ్రీ, ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, లేని పక్షంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు ఈ.ప్రశాంతి, నాయకులు పి.ప్రవళిక. నరేశ్, సిద్దు, రాము, లోకేశ్ పాల్గొన్నారు.