రుద్రంపూర్, ఏప్రిల్ 20 : తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి (SBTET) నిర్వహించే పాలీసెట్–2026 ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును అధికారులు పొడిగించారు. ముందుగా ఏప్రిల్ 20తో ముగియాల్సిన లేట్ ఫీజు లేకుండా ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీని ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కొనసాగుతుందని తెలిపారు. పాలీసెట్–2026 పరీక్షను మే 13న నిర్వహించనున్నట్లు మండలి స్పష్టం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఈ పొడిగించిన గడువును వినియోగించుకుని సమయానికి దరఖాస్తులు పూర్తి చేసుకోవాలని కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ సూచించారు.