ఇల్లెందు, జనవరి 26 : బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమిష్టి కృషితో ఇల్లెందు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఆ పార్టీ ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి ఆర్ జె సి కృష్ణ అన్నారు. సోమవారం ఇల్లెందు పార్టీ కార్యాలయం ముందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్నారు. ఆయన పాలనలో తెలంగాణ 10 సంవత్సరాలు అన్ని రంగాల్లో ముందుందని, భారతదేశ చరిత్రలోనే తెలంగాణను అతి తక్కువ కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసిఆర్ ది అని కొనియాడారు. భారత రాజ్యాంగం రాసిన బీ.ఆర్.అంబేద్కర్ ఆశయాల సాధనలో కేసీఆర్ ముందు వరుసలో ఉన్నారన్నారు. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం స్థానిక పార్టీ నాయకులు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తే ఇల్లెందు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురుతుందన్నారు.
మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో గత పది సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు, ప్రజలకు చేరిన విధానం వివరిస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ఏఎంసీ చైర్మన్ బానోత్ హరిసింగ్ నాయక్, డిసిసిబి మాజీ డైరెక్టర్ లక్కినేని సురేందర్ రావు, టి జి బి కే ఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్ రంగనాథ్, సీనియర్ నాయకులు సిలివేరి సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ జబ్బర్, పరుచూరి వెంకటేశ్వర్లు, అబ్దుల్ నబీ, పట్టణ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, కొక్కు సరిత, మదర్ బి,భూక్య దల్ సింగ్, లాల్ సింగ్, టేకులపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు కడకంచి పద్మ, తోట లలిత శారద, వాంకుడోత్ తార, చీమల సుజాత, నాయకులు కడగంచి వీరస్వామి, రవితేజ, పరిక పల్లి రవి, ఇమ్రాన్, సునీల్, శ్రీకాంత్ ,గిన్నారపు రాజేష్,చాంద్ పాషా, మాజీ సర్పంచ్ మౌనిక, భాగ్య, రవికాంత్, రామ్ లాల్ పాసి పాల్గొన్నారు.

Yellandu : ‘ఇల్లెందు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురడం ఖాయం’