ఇల్లెందు, జూన్ 13 : ఇల్లెందు పట్టణానికి చెందిన జానాద్ అబిద్ కాలి నడకన హజ్ యాత్ర చేశాడు. ఇల్లెందు నుండి కాలినడక బయల్దేరి 7,500 కిలోమీటర్లు నడిచి మూడు దేశాలను చుట్టి మహమ్మద్ ప్రవక్త జన్మస్థలం మక్కాకు చేరుకున్నాడు. హజ్ యాత్ర విజయవంతంగా ముగించుకుని తిరిగివచ్చిన అబిద్ను శుక్రవారం ఇల్లెందు పట్టణం జగదాంబ సెంటర్లో బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకుడు దిండిగాల రాజేందర్, ఇల్లందు పట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ముస్లింలు తమ జీవితకాలంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్లి రావాలని భావిస్తారని, అటువంటి పవిత్ర ప్రదేశానికి ఇల్లందు నుండి కాలినడకన చేరుకోవడం అనేది గొప్ప విషయమని కొనియాడారు. అల్లాహ్ అనుగ్రహంతో అబిద్, ఆయన కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సిలివేరి సత్యనారాయణ, 11వ వార్డు మాజీ కౌన్సిలర్ జె కె శ్రీను, టీబీజీకేఎస్ నాయకులు, ఎస్ రంగనాథ్, ఇల్లందు మండల అధ్యక్షుడు శీలం రమేశ్, చోటిమియా, ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, మహమ్మద్ అబ్దుల్ జబ్బార్, గిన్నారపు రాజేశ్, సాతల హరికృష్ణ, ఎస్.కె చాంద్ పాషా, సన రాజేశ్, మాజీ కో ఆషన్స్ సభ్యులు గాజి, మసూద్ రబ్, ఇల్లందు మండల యువజన నాయకులు భూక్యా సురేశ్, నీలం రాజశేఖర్, లలిత్ కుమార్ పాసి, ఎస్.కె ఇమ్రాన్, ఇంతియాజ్, పరికపెళ్లి రవి, సయ్యద్ బాబా, మీర్జా బేగ్, సర్వేష్, కమురుద్దీన్, ఇమ్రాన్, బాబా, జావిద్, ఖాజా పాల్గొన్నారు.