ఇల్లెందు, సెప్టెంబర్ 19 : ప్రస్తుత కాలంలో సైబర్ మోసాలు ఎక్కువైతున్నాయని, వారి నివారణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శుక్రవారం ఇల్లెందు డీఎస్పి కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఇల్లెందు డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్ డివిజన్ పరిధిలో ముఖ్యమైన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బాధితులకు అండగా ఉండి పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెంచేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పి చంద్రభాను, సీఐలు తాటిపాము సురేశ్, బత్తుల సత్యనారాయణ, ఎస్ఐలు సూర్యం, హసీనా, రాజేందర్, నాగుల్ మీరా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Yellandu : సైబర్ నేర నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలి : ఎస్పీ రోహిత్ రాజ్