భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి (Prajavani) కార్యక్రమానికి ఆదరణ కరువయింది. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కి ఫిర్యాదుదారులు సోమవారం నామమాత్రంగా వచ్చారు. ఉదయం 10 గంటలకు మొదలైన ప్రజావాణి 11.30 గంటలకే జనం లేక వెలవెలబోయింది.
ప్రజావాణికి కలెక్టర్ రాకపోవటంతో ఫిర్యాదుదారులు కూడా ఆసక్తి చూపటం లేదు. అధికారులు సైతం అంతంతమాత్రంగానే హాజరయ్యారు. కొన్ని శాఖల అధికారులు హాజరు కాకపోవటంతో కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. కలెక్టర్ లేనప్పుడు ఇచ్చిన ఫిర్యాదులకు పరిష్కారం లభించదని కొంతమంది బాధితులు బయటనే కూర్చొని ఉండిపోతున్నారు. అప్పటికీ రాకపోతే ఇంటికి వెళ్లిపోతున్నారు.