Speed Breakers | జూలూరుపాడు, ఫిబ్రవరి 12 : జూలూరుపాడు మండల పరిధిలోని సీతారామ ప్రాజెక్టు కెనాల్ వద్ద ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న వంతెన సమీపంలో రోడ్డుకు ఇరువైపులా సిమెంట్‌తో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు (Speed Breakers) ప్రమాదకరంగా మారాయి. వాహనదారులు ఆదమరిస్తే ఎగిరి పడాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. దీన్ని అధికారులు నిబంధనలకు విరుద్ధంగా సిమెంటుతో భారీగా ఏర్పాటు చేయడంతోపాటు రహదారికి ఇరువైపులా లోతైన గుంతలు ఏర్పడడంతో ప్రమాదాలకు కారణమవుతోంది.
పాడైపోతున్న ఇంజన్లు..
జూలూరుపాడు-వినోబా నగర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారి మీదుగా సీతారామ ప్రాజెక్ట్ వెళుతుండటంతో ప్రధాన రహదారిపై వంతెన నిర్మిస్తున్నారు. దీంతో రహదారి పక్క నుండి రోడ్డు ఏర్పాటు చేశారు. రహదారి పక్కన నియంత్రిక సూచికలను చిన్నగా పెట్టడంతోపాటు దగ్గరకు వచ్చేదాకా స్పీడ్ బ్రేకర్లు కనిపించకపోవడంతో ప్రతి రోజూ బైకులపై వెళ్తున్న వాళ్లు ప్రమాదాల బారిన పడుతున్నారు.
కార్లు, చిన్న వాహనాల ఇంజన్లు స్పీడ్ బ్రేకర్లకు తగిలి ఇంజన్లు పాడైపోతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి స్పీడ్ బ్రేకర్లను తొలగించి చిన్నగా నియంత్రికలను ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం
Mythological Drama Competitions | పౌరాణిక నాటక పోటీలకు బ్రోచర్ ఆవిష్కరణ
Maha Kumbh Mela | మాఘ పౌర్ణమి.. 1.83 కోట్ల మంది పుణ్యస్నానాలు