టేకులపల్లి, డిసెంబర్ 23 : బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా ప్రజలు బీఆర్ఎస్ వైపు నిలబడ్డారని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. టేకులపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ బలపరచగా గెలిచిన సర్పంచులకు మంగళవారం ఆమె సన్మానం చేశారు. గొల్యతండా, సులానగర్ లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన 3, 4 వార్డు సభ్యులు బీఆర్ఎస్లో చేరగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికార పార్టీ బెదిరింపులు, ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గక పార్టీ గెలుపు కోసం పోరాడిన గులాబీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. చాలా చోట్ల స్వల్ప తేడాతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారన్నారు. రానున్నాది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు.
కేసీఆర్ కదన రంగంలోకి దిగారని, కాంగ్రెస్ నాయకులకు చెమటలు పడుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచులు పంచాయతీలు అభివృద్ధి చేసుకోవాలని, ప్రజా సమ్యలపై పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు భూక్య దళ్‌సింగ్ నాయక్, పీఏసీఎస్ మాజీ చైర్మన్, మాజీ జట్పీటీసి లక్కినేని సురేందర్‌రావు, టేకులపల్లి మండలాధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్, టేకులపల్లి సర్పంచ్, ప్రధాన కార్యదర్శి బోడ బాలునాయక్, బానోత్ రామానాయక్. బానోత్ కిషన్‌నాయక్, మహిళా నాయకురాలు ఆమెడ రేణుక, బుర్రి వెంకటేశ్, కోరం కుమార్ స్వామి, కక్కెర్ల సురేశ్, నాగేందర్ పాల్గొన్నారు.

ekulapally : బీఆర్ఎస్ వెంటే ప్రజలు : మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్