TGRTC | కొత్తగూడెం అర్బన్, ఫిబ్రవరి 18 : ప్రయాణీకులే సంస్థకు ఆస్థి అని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతుందని కొత్తగూడెం డిప్యూటీ ఆర్ఎంఓ పవిత్ర అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, డెవర్లు, కండక్టర్, వివిధ విభాగాల సిబ్బందికి సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను ఏ విధంగా సాధించాలి అనే విషయాలపై మంగళవారం డిపో కార్యాలయ ఆవరణలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వివిధ లఘు చిత్రాలు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ ఆర్ఎంఓ మాట్లాడుతూ.. ప్రయాణీకుల రక్షణ, భద్రతకే ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు. సంస్థ రోజు వారి లక్ష్యాలు, ప్రయాణీకుల భద్రత, సంస్థ అభివృద్ధికి సిబ్బంది చేయాల్సిన పనులు వివరించారు. సమిష్టిగా, ఐకమత్యంతో కలిసి పనులు పూర్తి చేయాలని సూచించారు.
ఆర్టీసీ అంటేనే ప్రయాణీకులకు నమ్మకం అని ఆ నమ్మకాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ సంస్థను బలోపేతం చేస్తున్న సిబ్బంది అభినందనీయులని అన్నారు. నాలుగు రోజుల పాటు ఈ అవగాహన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, వివిధ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
State Level Select | రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు కోటపల్లి ఆశ్రమ విద్యార్థిని ఎంపిక
Kothagudem | భార్యా పిల్లలను చూడ్డానికి అత్తగారింటికి వెళ్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించారు..