– కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
– సిఐటియు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు
పెన్పహాడ్, ఏప్రిల్ 06 : పెన్పహాడ్ మండల కేంద్రంలో పనిచేసే పంచాయతీ కార్మికుడు ఒగ్గు మట్టయ్య (55) సోమవారం ఉదయం 5 గంటలకు గుండెపోటుతో మృతిచెందాడు. మట్టయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని సీఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మట్టయ్య గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తూ గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశాడన్నారు. ఆయన అకాల మరణం సీఐటీయూకు కార్మిక సంఘానికి తీరని లోటు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా రూ.5 లక్షలు వారి కుటుంబానికి ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు.
కార్మికులు గ్రామ అభివృద్ధి కోసం ఎంతో పని చేస్తున్నటువంటి కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వ్యవహరించడంతో అనేకమైన ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు కావున గ్రామపంచాయతీ కార్మికులకు వారి కుటుంబాలకు ఆరోగ్య భద్రత కార్డులు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఆయన అన్నారు. వారికి కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఓగ్గు రవి. సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ, గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ధనియాకుల శ్రీనివాసు, నకరికంటి నరసయ్య, సత్యం, నరేశ్, సత్తమ్మ, రేణుక, ఎల్లమ్మ, వెంకన్న, వీరస్వామి, సైదులు, రవి, శీను పాల్గొన్నారు.