KKR vs PBKS : సొంత మైదానంలో విజయంతో బోణీ కొట్టాలనుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లేలా ఉన్నాడు. ఇన్నింగ్స్ నాలుగో (3.4) ఓవర్లోనే వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. వాతావరణ శాఖ చెప్పినట్టే ఇన్నింగ్స్ మధ్యలో వాన అందుకోగా ఇరుజట్ల ఆటగాళ్లు డగౌట్‌కు పరుగులు తీశారు. మైదానం సిబ్బంది పరుగున వచ్చి పిచ్‌ను, ఔట్ ఫీల్డ్‌ను కవర్లతో కప్పేశారు. అప్పటికి కోల్‌కతా వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ అంచనా తప్పింది. శుభారంభంతో భారీ స్కోర్ చేయాలనుకున్న ఆ జట్టును ఆదిలోనే పంజాబ్ కింగ్స్ పేసర్ గ్జావియర్ బార్ట్లెట్() కష్టాల్లో పడేశాడు. తన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లతో కోల్‌కతాను దెబ్బకొట్టాడు.
Rain stops play in Kolkata 🌧️
Stay tuned for further updates ⏳
Updates ▶️ https://t.co/euWd7rFlqm#TATAIPL | #KhelBindaas | #KKRvPBKS
— IndianPremierLeague (@IPL) April 6, 2026
ఆది నుంచి తడబడుతున్న ఫిన్ అలెన్(6)ను ఐదో బంతికి వెనక్కి పంపిన బార్ట్లెట్ చివరి బంతికి మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ కామెరూన్ గ్రీన్(4)ను ఔట్ చేశాడు. 16 పరుగులకే రెండు బిగ్ వికెట్లు పడిన వేళ అజింక్యా రహానే(8 నాటౌట్), అంగ్క్రిష్ రఘువంశీ(7 నాటౌట్)లు ఆచితూచి ఆడారు. 3.4 ఓవర్ వద్ద వర్షం పడే సమయానికి కోల్‌కతా స్కోర్.. 25/1.
c Prabhsimran b Bartlett ✖️ 2⃣ @PunjabKingsIPL get Finn Allen and Cameron Green in the same over 😮
Updates ▶️ https://t.co/euWd7rFlqm#TATAIPL | #KhelBindaas | #KKRvPBKS pic.twitter.com/vwpNMmqQQH
— IndianPremierLeague (@IPL) April 6, 2026