చుంచుపల్లి, జూలై 06 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాల బలోపేతానికి అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సంఘం అధ్యక్షుడు మండే వీర హనుమంతరావు అన్నారు. అంతర్జాతీయ సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా కొత్తగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం ద్వారా పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థ (FPO) సేవలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వంటి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ అధికారులు, డీసీసీ బ్యాంక్ ప్రతినిధులు, సంఘ కార్యవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.