రామవరం, డిసెంబర్ 05 : గత రెండు సంవత్సరాలుగా సింగరేణి కార్మికుల పట్ల యాజమాన్యం మెడికల్ బోర్డు పైన వ్యవహరిస్తున్న శైలికి నిరసనగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష ఆర్ జీ వన్ జిఎం ఆఫీస్ ఎదుట ఈ నెల 6వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్టు టీబీజీకేఎస్ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ తెలిపారు. శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా రామవరం ప్రొఫెసర్ జయశంకర్ కార్మిక భవన్లో వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నప్పుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 80 శాతం సింగరేణి కార్మిక వర్గానికి కారుణ్య నియామకం కింద ఇన్వాల్యుడేషన్ చేసింది.
కాగా ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు బోర్డులు మాత్రమే నిర్వహించి అందులో ఒక బోర్డు రిఫరల్ ఫర్ హైయర్ సెంటర్ వారికి నిర్వహించి ఎనిమిది నెలలు పైబడి అన్ఫిట్లో ఉంచబడిన కార్మికులను 55 మందిలో ఐదుగురు మాత్రమే అన్ఫిట్ చేయడం అన్యాయమన్నారు. అదేవిధంగా గుండె జబ్బులు, పక్షవాతం, మూత్రపిండ వ్యాధులు వంటి దీర్ఘకాల వ్యాధులతో 15 నెలల పైబడి అన్ఫిట్లో ఉన్న కార్మికులను నవంబర్ నెలలో 130 మందిని బోర్డుకు పిలిచి సుమారు 23 మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం దుర్మార్గమన్నారు. తీవ్ర దీర్ఘ కాల వ్యాధులతో నడవలేని స్థితిలో, కదలలేని స్థితిలో ఉన్న కార్మికులను ఫిట్ చేయడం, ఫిట్ ఫర్ సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ ఇవ్వడం అన్యాయమన్నారు. కార్మికుడు పని చేయలేని స్థితిలో, కదలలేని స్థితిలో ఉంటే ఈ విధంగా వ్యవహరించడం వల్ల ఆ కుటుంబాలకు తీవ్రమైన అన్యాయం జరగడమేనన్నారు.
ఇటువంటి పరిస్థితుల పట్ల గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తూ మెడికల్ బోర్డు సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నట్లు దుయ్యబట్టారు. జులై, నవంబర్ నెలలో నిర్వహించిన మెడికల్ బోర్డుల్లో కార్మికులకు జరిగిన అన్యాయాన్ని సవరించడానికి మళ్లీ ఒక మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి ఫిట్ చేసిన కార్మికులందరినీ బోర్డుకు పిలువాలని డిమాండ్ చేస్తూ ఆర్ జి 1 ఏరియా జి ఏం ఆఫీస్ ముందు నిరసన దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్షలో టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు, కార్మికు సోదరులు పాల్గొనాలని అని కోరారు. ఈ సమావేశంలో తుమ్మ శ్రీనివాస్, ఈశ్వర్, బోరింగ్ శంకర్, ప్రసాద్, అశోక్ వెంకటేశ్వర్లు, జిఎస్ శ్రీనివాస్, ఆంజనేయులు, సూరజ్, సూర్యనారాయణ, అనుదీప్, రాజేష్, భాస్కర్, అశోక్ పాల్గొన్నారు.