Badradri Kothagudem | టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలని సొసైటీ డైరెక్టర్లు డీసీఓను కోరారు. ఈ మేరకు తొమ్మిది మంది సొసైటీ డైరెక్టర్లు బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ రావుపై 14 మంది సొసైటీ డైరెక్టర్లలో 9 మంది లక్కినేని సురేందర్ రావుకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయాలని డిసిఓకి వినతి పత్రం ఇచ్చారు.
అవిశ్వాస పత్రం ఇచ్చిన వారిలో డైరెక్టర్లు కంభంపాటి శ్రీనివాస్ చౌదరి, ఉల్లోజి ఉదయ్,కృష్ణార్జున రావు, మోహనరావు, లక్కినేని శ్యామ్, బాలాజీ, కుమ్మరి లావణ్య,బానోత్ ఇస్తారి, చీమల లక్ష్మీనారాయణ ఉన్నారు.
Power Demand | తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. మండుతున్న ఎండలే కారణం..!
KTR | హిమాయత్‌నగర్ చౌరస్తాలో గులాబీ జెండా ఎగురవేసిన కేటీఆర్