భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 24 : రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజును కొత్తగూడెంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వరకు డీజే సౌండ్లతో టపాసులు కాల్చుకుంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కార్యాలయంలో ఘనంగా స్వాగతం పలికి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా మహాలక్ష్మి, వనమా రాఘవేంద్రరావు, కామ్పిల్ కనకేష్, మంతపురి రాజు గౌడ్, అన్వర్ భాషా, బత్తుల వీరయ్య, బాదావత్ శాంతి, నవతన్, పాల్వంచ, కొత్తగూడెం యువ నాయకులు పాల్గొన్నారు.

Bhadradri Kothagudem : కొత్తగూడెంలో ఎంపీ వద్దిరాజు పుట్టినరోజు వేడుకలు