ఇల్లెందు, జనవరి 24 : రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ ఇల్లెందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కేక్ కట్ చేసి ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ఇల్లెందు జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ జబ్బర్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లెందు ఏఎంసీ మాజీ చైర్మన్ బానోత్ హరి సింగ్ నాయక్, డిసిసిబి మాజీ డైరెక్టర్ లక్కినేని సురేందర్‌రావు, సీనియర్ నాయకుడు ముఖ్య దళ్ సింగ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎస్.రంగనాథ్, అబ్దుల్ నబీ, శీలం రమేష్, జెకె శ్రీను, కటకంచి వీరస్వామి, రవితేజ, ఘాజి, అజ్మీర బావు సింగ్ సునీల్, లలితకుమార్ పాసి, మదర్ బి, మూలగుండ్ల ఉపేందర్, మునిగంటి శివ, బర్మావత్ లాల్‌చంద్, జి శ్రీను, బజార్ సత్యనారాయణ, రామ్ లాల్ పాసి, ఇమ్రాన్ పాల్గొన్నారు.

Yellandu : ఇల్లెందులో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు