దుమ్ముగూడెం: దుమ్ముగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్తూరు సీతారామారావు తండ్రి మస్తాన్రావు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు, చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్యలతో కలిసి సీతారామారావు నివాసానికి చేరుకుని మస్తాన్రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొత్తూరు సీతారామారావు, కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారి వెంట భద్రాచలం టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు అరికెల తిరుపతిరావు, కృష్ణమూర్తి వెంకటాపురం మండల అధ్యక్షుడు రాంబాబు, చర్ల మండల కార్యదర్శి నక్కినబోయిన శ్రీనివాస్, రైతుబంధు మండల అధ్యక్షుడు బత్తుల శోభన్, కెల్లా శేఖర్, పూజారి సూర్యచందర్రావు, కణితి లక్ష్మణ్, అపకా వీర్రాజు, వాగి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.