MLA | ప్రభుత్వ చర్యలతోనే రైతుల సంక్షేమం: ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు..

ములకలపల్లి: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్లతో కలిసి మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తొలుత పూసుగూడెం వ్యవసాయ క్లస్టర్లో రూ.22లక్షలు, రాజుపేట గ్రామంలో రూ.22లక్షలు, జగన్నాథపురంలో రూ.22లక్షలతో నిర్మించిన రైతువేదికలను ప్రారంభించారు.
అనంతరం పొగళ్లపల్లి గ్రామంలో రూ.1.57కోట్లతో నిర్మించిన 25 డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు రాజాపురం, జగన్నాథపురం, నల్లమూడి, గుట్టగూడెం గ్రామాల్లో రూ.32లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులను అన్నివిధాలుగా అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు చేయడంలో రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు, పీఆర్ ఈఈ సుధాకర్, జడ్పీ సీఈవో విద్యాలత, ఎంపీపీ మట్ల నాగమణి, జడ్పీటీసీ సున్నం నాగమణి, పీఏసీఎస్ చైర్పర్సన్ నడిపల్లి సునంద, రైతుసమన్వయ సమితి మండల అధ్యక్షుడు నాగళ్ల వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ కొదుమూరి పుల్లారావు, దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, సర్పంచ్లు కారం సుధీర్, సున్నం సుధాకర్, వాడె నాగరాజు, బైటి రాజేష్, గడ్డం భవానీ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

