టేకులపల్లి, జనవరి 7: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు పంచాయతీ సమీపంలోని రైతు వేదికలో కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi ), సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఈ పథకం వరంలాంటిది అన్నారు.
అర్హులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. టేకులపల్లి మండల వ్యాప్తంగా 82 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను,15 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ ఎల్ వీరభద్రం, సర్పంచ్ లు పాల్గొన్నారు.