నేలకొండపల్లి, అక్టోబర్ 1 : ఎవరు వచ్చినా మనకు ఏమీ ఇబ్బందిలేదని.. వచ్చిన వాళ్లు మాటలు చెబుతారు మళ్లీ కనపడరు.. పాలేరు నియోజకవర్గంలో మీ బిడ్డగా చెప్పిన మాట నిలబెట్టుకుంటాను.. వార్ వన్‌సైడే.. ఎలక్షన్ వన్‌సైడేనని ఎమ్మెల్యే కందా ళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పైనంపల్లిలో రూ.32.20 లక్షలతో గిడ్డంగి, రైతుసేవా కేంద్రం, రామచంద్రాపురం రూ.5 లక్షలతో రైతు సేవాకేంద్రం, సుర్థేపల్లి రూ.21 లక్షలతో గిడ్డంగి, నాచేపల్లిలో రూ.64 లక్షలతో గిడ్డంగి, సొసైటీ కార్యాలయాలను నూతనంగా నిర్మించారు. ఆయా గ్రామాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావుతో కలిసి ఆదివారం ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ రైతుల సౌలభ్యం కోసం ఎరువుల నిల్వ కోసం గిడ్డంగులను నిర్మించడం జరుగుతుందన్నారు. మండలంలోని రామచంద్రాపురం, సుర్థేపల్లి, నాచేపల్లి, మంగాపురంతండా, గువ్వలగూడెం గ్రామాల్లో నిర్మించిన చర్చీలు, ఆలయాలకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి విరాళాలు అందజేశారు. మంగాపురంతండాలో మహిళలతో కలిసి నృత్యం చేశారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 13మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ.6.82 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, ఏఎంసీ చైర్మన్ నంబూరి శాంత, సీడీసీ చైర్మన్ నెల్లూరి లీలాప్రసాద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ కోటి సైదారెడ్డి, మండల రైతుబంధు సమితి మండల కన్వీనర్ శాకమూరి సతీశ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు గండు సతీశ్, సర్పంచులు రాయపూడి నవీన్, తోళ్ల వెంకటేశ్వర్లు, మందడి రాజేష్, భూక్యా సుధాకర్, సోసైటీ చైర్మన్లు గూడవల్లి రాంబ్రహ్మం, తన్నీరు సత్యనారాయణ, ఎంపీటీసీ శీలం వెంకటలక్ష్మీ, నాయకులు వంగవేటి నాగేశ్వరరావు, నంబూరి సత్యనారాయణ, అనగాని నర్సింహారావు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో పలు కుటుంబాలు చేరిక..
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చూసి పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువాను కప్పుకున్నారు. రాయగూడెం గ్రామానికి చెందిన సూరేపల్లి ప్రేమ్‌కుమార్, మరో 16 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే కండువాను కప్పి ఆహ్వానించారు. కోరట్లగూడెం సుమారు 76 కుటుంబాలకు ఎమ్మెల్యే కండువాకప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ వజ్జా రమ్య, ఏఎంసీ చైర్మన్ నంబూరి శాంత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, డీసీఎంఎస్ చైర్మన్ నాగుబండి శ్రీనివాసరావు, నంబూరి సత్యనారాయణ, డేగల మమత, బచ్చలకూరి శ్రీను, మంకెనపల్లి రాము, పల్లపాటి ధనుంజయ్, మారుతి కామేశ్, గోపినాధ్, కోటేశ్వరరావు పాల్గొన్నారు.