Mirchi Farmer | చండ్రుగొండ, ఫిబ్రవరి 09 : ఈ ఏడాది మిరప రైతులకు కష్టాలు తప్పడం లేదు. గత ఏడాది కంటే ఈ ఏడాది మార్కెట్ ధరలు విపరీతమైన తేడా తగ్గుదల కనిపిస్తుంది. రూ.21 వేలకు మద్దతు ధర లభిస్తే, ప్రస్తుతం రూ.14 వేల లోపే కింటా ధర లభిస్తుంది. దీంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఒక్క క్వింటాల్‌కు రూ.7000కు పైబడి ధర తగ్గటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటివరకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని రైతులు వాపోతున్నారు. ఎకరానికి 15 నుండి 20 కింటాళ్లలోపే దిగుబడి వస్తుందని, ఇటువంటి సమయంలో మిరప పంట మార్కెట్ ధర తగ్గటంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రైతులను పట్టించుకోవడంలేదని రైతుల్లో ఆగ్రహావేషాలు వ్యక్తమవుతున్నాయి.
Manchireddy Kishan Reddy | దమ్ముంటే రైతులకు ఫార్మాసిటీ భూములిప్పించండి : మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని రచ్చబండపై నిరాహారదీక్షకు దిగిన యువకుడు