Land re-survey | భూముల రీసర్వే పనులు త్వరగా చేపట్టాలి : మంత్రి పొంగులేటి
భూముల రీసర్వే పనుల్లో జాప్యం జరిగితే సహించేదిలేదని..నిర్ణీత గడువులోగా భూముల రీసర్వే పూర్తిచేసేలా సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు.
బూర్గంపహాడ్, జూలై 19 : భూముల రీసర్వే పనుల్లో జాప్యం జరిగితే సహించేదిలేదని..నిర్ణీత గడువులోగా భూముల రీసర్వే పూర్తిచేసేలా సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం నియోజకవర్గ పర్యటనలో భాగంగా సారపాక ఐటీసీ అతిథిగృహంలో రెవెన్యూ, అటవీ, పోలీసుశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జిల్లాలో 70 గ్రామాల్లో చేపడుతున్న భూముల రీసర్వే పనుల పురోగతిని సమీక్షించి అధికారులు జిల్లాలో ప్రస్తుతం 14 గ్రామాల్లో రీ సర్వే పనులు కొనసాగుతుండగా వాటిలో ఐదు గ్రామాల్లో పనులు పూర్తయ్యాయని వివరించారు.
మిగిలిన గ్రామాల్లో నిర్ణీత గడువులో రీసర్వే పూర్తిచేసేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో కలెక్టర్ అంకిత్, జిల్లా అటవీశాఖ అధికారి సిద్దార్థ విక్రమ్సంగ్, ఎస్పీ రోహిత్‌రాజ్, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, ఆర్డీవో మధు, అటవీ, రెవెన్యూ, పోలీసుశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

