బూర్గంపహాడ్, మార్చి 20 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లి బంజర్ పీహెచ్సీ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ విజయవంతమైంది. ఆరోగ్య శిబిరాన్ని సర్పంచ్ బొర్రా సుభద్ర ప్రారంబించారు. శిబిరంలో సుమారు 413 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. 93 మంది గర్భిణులు, 34 మంది పంటి సమస్యతో బాధపడే వారికి, 29 మంది చిన్నారులు, 157 మందికి ఆయా విభాగాల వైద్యులు, జనరల్ ఫిజీషియన్లతో పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ స్పందన, పీహెచ్సీ వైద్యులు పావని, చిన్నపిల్లల వైద్య నిపుణులు ప్రియాంక, జనరల్ మెడిసన్ వైద్యులు స్నేహ, వైద్యులు క్రాంతికుమార్, సాగరిక, అమరేందర్‌రెడ్డి, రాజేశ్‌తో పాటు ప్రత్యేక విభాగాల వైద్యులు, హెచ్ఐఓ రవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.