చుంచుపల్లి, మే 21 : రాబోయే ఎస్.ఐ.ఆర్ కార్యక్రమం అలాగే ఈ-రోల్ మ్యాపింగ్ పురోగతి మెరుగుదల లక్ష్యంగా చుంచుపల్లి మండల స్థాయి రాజకీయ పార్టీల సమావేశాన్ని తాసీల్దార్ నాగరాజు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశం ఈఆర్ఓ కొత్తగూడెం ఆదేశాల మేరకు నిర్వహించినట్లు తాసీల్దార్ తెలిపారు. ఓటరు జాబితా సవరణ, ఈ-రోల్ మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచడం, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సూచనలు, అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా తాసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం ఎంతో ముఖ్యమని, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామని పేర్కొన్నారు.