టేకులపల్లిలో భారీగా మట్టి అక్రమ రవాణా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో సులానగర్, దాసుతండా, కుంటల్ల, హన్మతండా, బొమ్మనపల్లి, సంపత్ నగర్ పంచాయతీల్లో భారీగా మట్టి అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సులానగర్ సమీపంలో ప్రధాన రహదారి..
టేకులపల్లి, మే 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో సులానగర్, దాసుతండా, కుంటల్ల, హన్మతండా, బొమ్మనపల్లి, సంపత్ నగర్ పంచాయతీల్లో భారీగా మట్టి అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సులానగర్ సమీపంలో ప్రధాన రహదారి ఎన్ హేచ్ 980పీ రోడ్డు పక్కనే లోతుగా అక్రమ మట్టి రవాణా చేయడంతో అక్కడ క్వారీని తలపిస్తుందని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దాసుతండా, కుంటల్ల, హన్మతండా, బొమ్మనపల్లి ప్రాంతాల్లో అనునిత్యం మట్టి రవాణా కొనసాగుతునే ఉందని, రాత్రి వేళల్లో వాహనాలు ఓవర్ స్పీడ్తో వెళ్తున్నట్లు మండల ప్రజలు తెలుపుతున్నారు.
చెరువుల్లో భారీగా పట్టపగలే యదేచ్చగా మట్టి తోలకం చేస్తుంటే అధికారులు పట్టించుకోకపోవడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల అండతోనే అక్రమార్కులు మట్టి రవాణా చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇతర అవసరాలకు మట్టిని రూ.600 నుండి రూ.800 వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి మట్టి అక్రమ తవ్వకాలు అరికట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మట్టి రవాణాపై టేకులపల్లి తాసీల్దార్ వివరణ కోరగా మట్టి రవాణాకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

