– సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు మునిగడప వెంకటేశ్వర్లు
రుద్రంపూర్, ఆగస్టు 17 : దేశవ్యాప్తంగా చేపట్టిన ఎస్ ఐ ఆర్ (ప్రత్యేక ఓటర్ సవరణ) కార్యక్రమం డ్రాప్ పబ్లికేషన్ ప్రచురణ చూస్తే ఎలక్షన్ కమిషన్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు అన్నారు. నేడు ప్రకటించిన ఎస్ ఐ ఆర్ డ్రాప్ పబ్లికేషన్ చూస్తే అలాగే అనిపిస్తుందన్నారు. నెల రోజులు అధికారులు,బి ఎల్ ఓ, బిఎల్ఏలు ప్రతి ఇల్లు తిరిగి ఓటర్ వివరాలు, ఫోటోలు మార్చుకునే వారి ఫొటోలు సేకరించి, ఓటర్ లిస్ట్ లో ఉన్న తప్పులు, అడ్రస్ మార్పులు తదితర వివరాలు అప్లోడ్ చేసిన కూడా నేడు ప్రకటించిన లిస్టులో అవి లేకపోవడం ఆ వివరాలు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు.
యధాతధంగా కొత్త సీసాలో పాత సారా పోసినట్లుగా షిఫ్టేడ్, డబుల్ ఓట్లు తొలగించి లిస్టును ప్రకటించారే తప్ప ఓటరు ఇచ్చిన వివరాలు, మార్పులు కానీ, కొత్త ఫొటో మార్పు కానీ ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన డ్రాప్లికేషన్లో అవి కనపడడం లేదన్నారు. మరలా ఫారం 8 తో ఓటర్ దరఖాస్తు చేసుకోవాలంటే కలర్ ఫొ టో దిగాలి, జిరాక్స్లు తీయాలి, ఇలా ఆర్థిక భారం, కాలయాపన జరుగుతుందని ఇది గమనించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఫైనల్ పబ్లికేషన్లో ఎస్ ఐ ఆర్ సర్వేలో ఓటర్ ఇచ్చిన సమాచారాన్ని వారు కొత్త ఫొటోలను అడ్రస్ మార్పు అప్లోడ్ చేసిన వివరాల ప్రకారం ఫైనల్ పబ్లికేషన్లో ప్రచురించాలని ఎలక్షన్ అధికారులను కోరుతున్నట్లు పేర్కొన్నారు.