భద్రాచలం: భద్రాచలంలో (Bhadrachalam) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్లో ఉన్న గోడౌన్లో భారీ పేలుడుతో మంటలు వ్యాపించాయి. బ్లీచింగ్ బస్తాలు, యాసిడ్ బాటిళ్లన గోదామ్‌లో కాంట్రాక్టర్ నిల్వ ఉంచారు. అయితే చాలా రోజుల నుంచి వెంటిలేషన్ లేకపోవడంతో గురువారం ఉదయం 5 గంటల సమయంలో ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల ధాటికి కొన్ని వాహనాలు అప్పటికే కాలిపోయాయి. అయితే ఎవరూ లేని సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. ఎలాంటి అనుమతులు లేకుండా జనావాసాల మధ్య బ్లీచింగ్, యాసిడ్ నిల్వ ఉంచిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.