బూర్గంపహాడ్, మే 19 : వడదెబ్బ తగలడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధి పినపాక పట్టీనగర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పినపాక పట్టీనగర్ గ్రామానికి చెందిన భూక్యా వెంగళరావు(50) ఇంటి వద్ద సోమవారం మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ నిర్మాణ పనులు చేస్తూ అలసిపోయాడు. ఎప్పటి మాదిరిగానే భోజనం చేశాక ఇంట్లో నిద్రించాడు. అయితే ఉదయం నిద్రలేవకపోవడంతో వడదెబ్బ కారణంగా మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు భావించారు. వెంగళరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.