బూర్గంపహాడ్, మే 29 : వడదెబ్బకు వ్యక్తి మృతిచెందిన సంఘటన భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన యారం చిన్న సుబ్బారెడ్డి (46) వృత్తి రీత్యా తాపీ మేస్త్రి. గురువారం పనికి వెళ్లి వచ్చిన తర్వాత ఎండ వేడిమికి తట్టుకోలేక డీహైడ్రేషన్‌కు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం భద్రాచలంలోని ఓ ప్రవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడే మరో వైద్యశాలకు తరలించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆరోగ్యం విషమించి చనిపోయాడు. ఎండ తీవ్రతను తట్టుకోలేక ఇప్పటికే మండలంలో పలువురు వడదెబ్బతో మృతిచెందారు. తాజాగా మోరంపల్లి బంజర కు చెందిన చిన్న సుబ్బారెడ్డి మృతితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.