కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా గుండాల మండలంలో విషాదం చోటుచేసుకున్నది. బైక్పై పొలానికి వెళ్తూ విద్యుదాఘాతంతో వాహనంతో సహా యువకుడు దగ్ధమయ్యాడు. గుండాల మండలంల శంభునిగూడెం పంచాయతీ వెన్నెలబైలు గ్రానికి చెందిన పర్సిక రాజు (35) ద్విచక్ర వాహనంపై పొలం వద్దకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ హైటెన్షన్ తీగలు తగలడంతో బైక్ దగ్ధమైంది. దీంతో రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Electrocuted