టేకులపల్లి, జనవరి 8 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Kothagudem district) టేకులపల్లి మండలంలోని ఒడ్డుగూడెం సమీపంలో బైక్ పై(Bike accident) నుంచి ప్రమాదవశాత్తు గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బూడిదగడ్డ గ్రామానికి చెందిన గొగ్గల రాజు (29) టేకులపల్లి మండలం బర్లగూడెం గ్రామానికి చెందిన రేష్మాతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది.
ఈ క్రమంలో బుధవారం బర్లగూడెం అత్తారింటికి నుంచి కొత్తగూడెం తన ఇంటికి వెళ్తుండగా..ఒడ్డుగూడెం సమీపంలో బైక్ పై నుంచి గోతిలో పడి మృతి చెందాడు. మృతుడికి మూడేళ్ల పాప ఉంది. బోడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాజు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.