కారేపల్లి, సెప్టెంబర్ 19 : పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి విషమించడంతో మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని బజ్జతండాకు చెందిన బానోతు భద్రు సింగ్ (50) నాలుగు రోజుల క్రిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా వైద్యం కొనసాగుతుంది. కాగా పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం కన్నుమూసినట్లు తెలిపారు. భధ్రు సింగ్కు భార్య జ్యోతి, కుమారుడు, కుమార్తె (వివాహిత) ఉన్నారు.