– కొత్తగూడెం ఏరియా పివికే-5 ఇంక్లైన్లో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ గేట్ మీటింగ్
రామవరం, డిసెంబర్ 30 : సింగరేణి సంస్థకు నూతన బొగ్గు బ్లాకులు తీసుకొచ్చి సింగరేణి మనుగడను కాపాడాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు, మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పిసికే-5 ఇంక్లైన్లో పిట్ కార్యదర్శి హుమాయూన్ అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేసి ప్రతి కార్మికుడికి రూ.30 లక్షలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు, యాజమాన్యం మెడికల్ బోర్డు నిర్వహించకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. అదేవిధంగా సంస్థ ప్రవేట్ పరం కాకుండా కాపాడుకోవడానికి పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సమ్మెకు సైతం వెనకడబోమని స్పష్టం చేశారు, క్వాలిటీ బొగ్గు వచ్చే పీకే ఓసీ డీప్‌సైడ్ బ్లాక్ ను వేలంలో పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
కార్మికుల మారుపేర్ల సమస్య పరిష్కరించాలని, సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సోమవారం జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కార్మికుల సమస్యల పరిష్కారానికై మాట్లాడారన్నారు, సింగరేణి స్థితిగతులు, కార్మికుల సమస్యలపై ఎప్పుడూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, సహాయ కార్యదర్శి గట్టయ్య, నాయకులు ఎస్.నాగేశ్వరరావు,కమల్, సాయి పవన్, భుక్య రమేశ్, రామచందర్, క్రాంతి, రమణ, ఆకుల శ్రీనివాస్, సుమన్, మదనయ్య, ఇరప కృష్ణ, ధర్మ, శేషయ్య, దేవసింగ్ పాల్గొన్నారు.

Ramavaram : సింగరేణి సంస్థను కాపాడుకుందాం : కొరిమి రాజ్‌కుమార్