రామవరం, జూన్ 02 : ఎంతోమంది అమరవీరుల త్యాగఫలం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సాలెం రాజు అన్నారు. సోమవారం 11వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఏరియాలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జీఎం కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రుద్రంపూర్ మార్కెట్ సెంటర్లో గల అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అమరవీరుల స్తూపం, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాం, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ప్రాంగణం నుండి ప్రగతి వనం వరకు తెలంగాణ రన్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు గనులపై డిపార్ట్మెంట్లలో పీఓలు, ఏజెంట్, మైన్/డిపార్ట్మెంట్ అధిపతులు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఆలపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సి&ఎండి ఎన్. బలరాం దిశా నిర్దేశానుసారం సింగరేణి సంస్థ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఆయన దిశా నిర్దేశంతో సంక్షేమ కార్యక్రమాలు కాకుండా, నిర్దేశించిన లక్ష్యాలను కూడా సాధిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా సేవా ప్రెసిడెంట్ శ్రీమతి జి.మధురవాణి షాలేం రాజు, ఎస్ఓటు జిఎం జీవి కోటిరెడ్డి, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రెటరీ వట్టికొండ.మల్లికార్జున్, ప్రాతినిధ్య సంఘం ఐ.ఎన్.టి.యు.సి ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, సింగరేణి అధికారుల సంఘం కొత్తగూడెం ఏరియా జనరల్ సెక్రెటరీ ఉపేందర్, అధికారులు సిహెచ్ రామకృష్ణ, కే హనా సుమలత, కె.సూర్యనారాయణ రాజు, బి.రవీందర్, బి.శివకేశవరావు, ఎన్ యోహాను, టి. సత్యనారాయణ, ఎం. వెంకటేశ్వర్లు, మదన్మోహన్, బి.మాధవ్, కె.శేష శ్రీ, ఎం.మురళి, బి.తౌరియా, యు.అభిలాష్, సేవా సెక్రటరీ వై.అనిత, జీఎం కార్యాలయ ఫిట్ సెక్రటరీలు కె.సౌజన్య, సీహెచ్.సాగర్, ఇతర అధికారులు, జీఎం కార్యాలయ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.
Ramavaram : కష్టపడి సాధించుకున్నాం.. ఇష్టపడి అభివృద్ధి చేసుకుందాం : ఏరియా జీఎం శాలెం రాజు