రామవరం, జూలై 25 : మహిళలు స్వసక్తితో స్వావలంబన సాధించి ఎదగాలనే ఆకాంక్షతో సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఆదేశాలతో తేనె టీగల పెంపకం కార్యక్రమాన్ని ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు తెలిపారు. శుక్రవారం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ ఆర్ సి ఓ ఏ క్లబ్లో తేనె టీగల పెంపకంపై శిక్షణ తీసుకుంటున్న మహిళలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో జీకేఓసి, వీకేఓసి ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల మహిళలకు కార్పొరేట్ సామాజిక బాధ్యతో తేనె టీగల పెంపకంపై మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ, అగర్తల, వెస్ట్ త్రిపుర చెందినవారు ఉచిత శిక్షణతో పాటుగా సంబంధిత పరికరాలను ఇచ్చి స్వయం ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం 120 మంది మహిళలకు శిక్షణ ఇచ్చామని, శిక్షణ అనంతరం తేనె టీగల పెంపకానికి సంబంధించిన పరికరాలను కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. శ్రద్ధతో నేర్చుకుని తేనె టీగల పెంపకం చేపడితే నెలకు ఒక్క బాక్స్ ద్వారా సుమారు రూ.6 వేల సంపాదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జె.గట్టయ్య, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి.రజాక్, కొత్తగూడెం ఏరియా ఎస్ ఓ టు జి ఎం. జి.వి. కోటిరెడ్డి, ఏజీఎం ఎఫ్ అండ్ ఎ కె.హనా సుమలత, డీజీఎం (పర్సనల్) జి.వి.మోహన్ రావు, డివై పిఎం జి.హరీశ్, రాజ్వాలియా మాలిక్, మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ (ట్రైనర్), జిఎం కార్యాలయం ఫిట్ సెక్రెటరీ సాగర్, మహిళా అభ్యర్థులు పాల్గొన్నారు.
Ramavaram : శ్రద్ధతో నేర్చుకోండి.. స్వశక్తితో ఎదగండి : జీఎం శాలెం రాజు