TG JENCO | పాల్వంచ, ఫిబ్రవరి 15 : తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (1104) జెన్కో అధ్యక్షుడు కేశబోయిన కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇవాళ టీజీ జెన్కో డైరెక్టర్(ధర్మల్) లక్ష్మయ్యను ఆ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు.
కేటీపీఎస్తోపాటు భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను పరిశీలించేందుకు కేటీపీఎస్ గెస్ట్ హౌస్‌కి వచ్చిన సందర్భంగా ఆ సంఘం నాయకులు డైరెక్టర్‌ను కలిసి దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ సమస్యలు, ఈపీఎఫ్ టు జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం, కల్పించాలని కోరారు. అదేవిధంగా ఏడవ దశ పీఎల్ఎఫ్ కల్పించాలని, కేటీపీఎస్ పాత ప్లాంట్ నందు 800 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన నూతన పవర్ ప్లాంట్ నిర్మించాలని కోరారు.
వీటితోపాటు ఒకే క్యాడర్లో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు కొత్త శాంక్షన్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రమోషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఏటీపీఎస్ కాలనీ నందు రోడ్ల మరమ్మతులు, ఆర్టిజన్ కార్మికులకు కేటీపీఎస్ హాస్పిటల్ నందు వైద్యం అందించాలని, కేటీపీఎస్ 5, 6 దశ నందు యాష్ లోడింగ్ దగ్గర డస్ట్ రాకుండా చూడాలని ఆయన దృష్టికి తీసుకుపోయారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంగం సుధీర్, ఏడవ దశ రీజినల్ అధ్యక్ష కార్యదర్శులు రాజేందర్, యాకూబ్ ఐదవ దశ అధ్యక్ష కార్యదర్శులు గోపి, బిచ్చా రమేష్, గండి రమేష్, చెరుకు అశోక్, ఏసోబు రామకృష్ణ, ఇస్లావత్ రాజేష్, నరేష్, సతీష్, శేషగిరి రావు, గణపతి తదితరులు పాల్గొన్నారు.
Government Hospital | రికార్డ్ బ్రేక్.. 5 రోజుల్లో 200 సర్జరీలు