పాల్వంచ : కేటీపీఎస్ ఆరో దశలో నిర్మాణ కార్మికులుగా పనిచేసిన వారు చేపట్టిన నిరాహారదీక్ష శిబిరాన్ని శనివారం బీఆర్ఎస్ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దీక్ష చేస్తున్న కార్మికులను ఉద్దేశించి బీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవ, కిలారు నాగేశ్వరరావు మాట్లాడారు. ఆరో దశ కర్మాగారం నిర్మాణం కోసం కార్మికులు ఎంతో కృషి చేశారని, ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పనుల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. వారిని ఏడో దశ కర్మాగారంలో ఆర్టిజన్లుగా తీసుకుంటామని హామీ ఇచ్చి తీసుకోకపోవడం విచారకరమని అన్నారు.
తక్షణమే టీజీ జెన్కో యాజమాన్యం స్పందించి కార్మికులను ఆర్టిజన్లుగా తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. కేటీపీఎస్ 6, 7 దశల నిర్మాణానికి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కృషి మరువలేనిదని అన్నారు. 2012-2013 లో కేటీపీఎస్ నిర్మాణ కార్మికుల కోసం 6వ దశకు 4 రోజుల ముందు ఆమరణ నిరాహార దీక్ష చేశానని రాఘవ చెప్పారు. నాటి నిరాహార దీక్షకు కేటీపీఎస్‌లోని యూనియన్లకు అతీతంగా తనకు మద్దతు ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్‌లో కేసీఆర్‌ను వనమా వెంకటేశ్వరరావు కలువనున్నారని, కేటీపీఎస్ నిర్మాణ కార్మికుల సమస్యను ఆయనకు వివరిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కిలారి నాగేశ్వరరావు, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, పాల్వంచ పట్టణ అధ్యక్షులు పూసల విశ్వనాథం, డిష్ నాయుడు, మల్లెల రవి చందర్, దాసరి నాగేశ్వరరావు, కాల్వ ప్రకాష్, భూక్య చందు నాయక్, సమ్మయ్య గౌడ్, బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు దుర్గాప్రసాద్, జనరల్ సెక్రెటరీ కంచర్ల రామారావు, బేతంచెట్టి విజయ్, తెలంగాణ కేటీపీఎస్ సురేష్, గురవయ్య, పునుగుల ఉదయ్, కుంపటి శివ, వెంకట్ నానారాయణ, రంగయ్య, పత్తిపాటి శ్రీను, కోదండరావు, మధు, బూదే గిరి, జక్కుల వెంకటేశ్వర్లు, రవి, బట్టు మంజుల, ఆనంద్, నిర్మాణ కార్మికుల ఆర్గనైజర్స్, వాంగులోత్ హరిరామ్, బి మురళీకృష్ణ, భూక్య లక్ష్మణ్ నాయక్, ఏ చంటి, బద్రు, జమున, కేటీపీఎస్ సత్యవతి తదితరులు పాల్గొన్నారు.