Kothagudem DSP | రామవరం, డిసెంబర్ 5: కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహమాన్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తస్రావం జరుగుతున్న ఇద్దరు మహిళలకు మహిళలకు ధైర్యం చెప్పారు. అధికారిక పర్యటన నిమిత్తం వెళ్తున్న సమయంలో గాయపడిన మహిళలను గమనించిన ఆయన వారి వద్దకు వెళ్లి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. “ఏమీ కాదు… నేను ఉన్నాను, భయపడాల్సిన పనిలేదు” అని వారికి ధైర్యం చెప్పారు. అంబులెన్స్ రావడం ఆలస్యం అవుతుందని తెలిసి, ఒక ఆటోను మాట్లాడి వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా నడవలేక ఇబ్బంది పడుతున్న మహిళలను ఆయనే స్వయంగా ఆటో ఎక్కించారు.
గాయపడిన ఇద్దరు మహిళలు ఆస్పత్రికి చేరేంతవరకు డీఎస్పీ పక్కనే ఉన్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.