– అధికారులు, ఉద్యోగులకు జీఎం అభినందనలు
రుద్రంపూర్, మార్చి 23 : కొత్తగూడెం ఏరియాలో ఆర్సిహెచ్పి ద్వారా జరిగిన బొగ్గు రవాణా నిర్ణయించిన లక్ష్యాన్ని గడువు కంటే ముందుగానే అధిగమించింది. నిర్దేశించిన 49.50 లక్షల టన్నుల డిస్పాచ్ లక్ష్యాన్ని అధిగమిస్తూ తేదీ 22.03.2026 నాటికి మొత్తం 50.15 లక్షల టన్నుల బొగ్గు డిస్పాచ్ చేయడం ద్వారా మార్చి 31 గడువు కంటే ముందుగానే లక్ష్యాన్ని సాధించింది. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలెం రాజు మాట్లాడుతూ.. ఈ విజయానికి కృషి చేసిన అధికారులు, ఉద్యోగులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సమిష్టి కృషి, సమన్వయం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. ఇదే ఉత్సాహంతో భవిష్యత్లో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజినీర్ కే.ఎస్.ఎన్. రాజు, ఎస్.ఈ (ఈ అండ్ ఎం) అజ్మీరా శ్రీనివాస్, ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ,గ ట్టయ్య, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.