రామవరం, అక్టోబర్ 19: సింగరేణి కొత్తగూడెం ఏరియా వీకే కోల్ మైన్ వ్యూ పాయింట్ నుండి ఓపెన్ కాస్ట్ లో జరుగుతున్న మట్టి తొలగింపు పనులను డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కొప్పుల వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అనుకున్న సమయంలో లోగా బొగ్గు ఉత్పత్తికి కావాల్సిన మట్టి తొలగింపు పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఓబీ డంపులలో, హాలర్ రోడ్ పై తగు రక్షణ సూత్రాలను పాటిస్తూ పనులను చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అంతేకాకుండా వీకే కోల్ మైన్ కోల్ డిస్పాచ్ ఏర్పాట్ల, ప్రస్తుత స్థితిని సమీక్షించారు. కొత్తగూడెం ఏరియా ఉత్పత్తి, డిస్పాచ్ వివరాలను ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు వివరించారు. ఈ కార్యక్రమంలో జీఎంతో పాటు వీకే కోల్ మైన్స్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం రమేష్, మేనేజర్ రామచంద్ర మురళి, శోధ ఓబీ కాంట్రాక్ట్ మేనేజర్ కిషోర్ , అధికారులు పాల్గొన్నారు.