టేకులపల్లి, అక్టోబర్ 22 : టేకులపల్లి మండల కేంద్రంలో కొమురం భీమ్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మర వరప్రసాద్ మాట్లాడుతూ.. భూమి కోసం భూక్తి కోసం నిజాం సర్కారుపై పోరాడిన గిరిజన పోరాట యోధుడు కొమురం భీమ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బోడ బాలునాయక్, మాజీ ఎంపీటీసీ అప్పారావు, నాయకులు బర్మావత్ శివకృష్ణ, లచ్చునాయక్, చీమల రామకృష్ణ, కరుణాకర్, మాజీ సర్పంచ్ ఇర్పా లక్ష్మీనారాయణ, ఆమేడ రేణుక, బన్సీలాల్, మాజీ సర్పంచ్ రాజేందర్ పాల్గొన్నారు.