భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని శనివారం ఖమ్మం అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయంలోని మూలమూర్తుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న భద్రుని కోవెల, లక్ష్మీతాయారమ్మవారి సన్నిధి, ఆంజనేయస్వామి ని దర్శించుకున్నారు.
అనంతరం లక్ష్మీతాయారమ్మ వారి సన్నిధిలో దేవస్థానం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట దేవస్థానం ఈవో బానోతు శివాజీ, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.