రామవరం, నవంబర్ 26 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పర్సనల్ జనరల్ మేనేజర్లు జి.వి. కిరణ్ కుమార్ (వెల్ఫేర్ & CSR), ఏజీఎం మురళీధర్ రావు (EE సెల్ & RC) బుధవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ కాలనీలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియాన్ని సందర్శించి, జరుగుతున్న పనులను సమీక్షించారు. కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ ఈ నెల 28 నుండి 30 వరకు కొత్తగూడెం ఏరియాలో జరుగనున్న నేపథ్యంలో గ్రౌండ్ లెవెలింగ్, కబడ్డీ కోర్టులు, స్టేజ్ ఏర్పాట్లు, క్రీడాకారుల వసతి గృహాల ఏర్పాట్లను అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలేం రాజు ఆదేశాల మేరకు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఏ చిన్న నిర్లక్ష్యం లేకుండా, జాప్యం చోటు చేసుకోకుండా, వివిధ కమిటీల మధ్య సమన్వయం పెంచి టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఈ క్రీడలను శ్రద్ధగా నిర్వహించడం వల్ల భవిష్యత్‌లోనూ కొత్తగూడెం ఏరియాకు కోల్ ఇండియా లెవెల్ క్రీడా పోటీలను నిర్వహించే అవకాశాలు పెరుగుతాయన్నారు. అసిస్టెంట్ స్పోర్ట్స్ సూపర్వైజర్ & ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంసి. పాస్నైట్, స్పోర్ట్స్ సూపర్వైజర్లు జాన్ వెస్లీ, సిహెచ్.అశోక్, పరసా శ్రీనివాస్, నరేందర్ రెడ్డి తదితరులు గ్రౌండ్ ను పరిశీలించి తక్షణం పూర్తి చేయాల్సిన పనులను సంబంధిత విభాగాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిజిఎం (పర్సనల్) జీవి మోహన్ రావు, సీనియర్ పిఓ మతిన్, డివై ఎస్ఈ (సివిల్) కె.రాజా రామారావు, కోఆర్డినేటర్ బి.భీముడు, స్పోర్ట్స్ జనరల్ కెప్టెన్ బి.వెంకటేశ్వర్లు, స్పోర్ట్స్ ఆర్గనైజర్లు సిహెచ్.సాగర్, కె.శ్రీనివాస్ రెడ్డి, ఎస్.కే.గులాం గౌస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Ramavaram : ‘సింగరేణి ప్రతిష్ట పెరిగేలా కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణ’